Breaking News

Loading..

ఆదివాసీల ధర్మ యుద్ధం. దద్దరిల్లిన భద్రాచలం...


  • ఆదివాసుల ఐక్యత వర్ధిల్లాలి..
  • చేతిలోన బాణం ఉంది పోరాడే శక్తి ఉంద

బిసిఎం10 న్యూస్ సెప్టెంబర్ 28 భద్రాచలం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం జూనియర్ కాలేజీ మైదానంలో ఏర్పాటు చేసినటువంటి ఆదివాసి  ధర్మ యుద్ధభేరి  సమావేశంలో  జేఏసీ నాయకులు మాట్లాడుతూ  లంబాడీల వల్ల ఆదివాసీలకు జరుగుతున్న అన్యాయాన్ని వివరించారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు చుంచు  రామకృష్ణ మాట్లాడుతూ 1950 సంవత్సరంలో లేని లంబాడీలు చట్టబద్ధత లేకుండా ఎస్టీ రిజర్వేషన్ ఫలితాలు పొందుతూ అసలైన ఆదివాసులని మోసం చేస్తున్నారని ఆయన అన్నారు. లంబాడీలు ఏజెన్సీ ఫలాలు పొందుతున్నారని 1976 దొడ్డి దారిన వచ్చిన లంబాడీల తరిమికొట్టే బాధ్యత ప్రతి ఒక్క ఆదివాసి తీసుకొని ఉద్యమంలో భాగస్వామి కావాలని పిలుపునిచ్చారు. ఈరోజు లంబాడీలు మేము 60 లక్షలు ఉన్నాం అన్న జనాభా 1976 సంవత్సరం ముందు ఎంతమంది ఉన్నారనేది యావత్ తెలంగాణ తెలుసుకోవాల్సింది ఉంది. ఆదివాసి రిజర్వేషన్లు ఉద్యోగాలు ఏజెన్సీ ఫలాలు పొందుతూ మా ఆదివాసులకు అన్యాయం చేస్తున్నారని అలా చేసే లంబాడిలను తరమికొట్టాలని అన్నారు. అనంతరం మైపాటి అరుణ్ కుమార్ మాట్లాడుతూ మేము 10 లక్షల ఉన్న పాండవులతో సమానమని మీరు 50- 60 లక్షల ఉన్న కౌరవులతో సమానమని వారు ఈ సందర్భంగా గుర్తు చేశారు. అంతిమంగా విజయం పాండవులదేనని త్వరలో ఆదిలాబాద్ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తామని దానికి కూడన పది లక్షలకు తగ్గకుండా పెద్ద ఎత్తున వివిధ రాష్ట్రాల నుంచి ఆదివాసీలు వస్తారని వారు అన్నారు.పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు మాట్లాడుతూ గెలిచిందంతా న్యాయం కాదని చివరికి గెలిచేది న్యాయమే అని శ్రీశ్రీ చెప్పిన మాటలు గుర్తు చేస్తూ మన గెలుపు తధ్యమని వారు అన్నారు. అంతేకాకుండా అటవీశాఖ చైర్మన్ పోదం వీరయ్య    మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉపముఖ్యమంత్రి బట్టి విక్రమార్కుని   ఒప్పించే బాధ్యత తాను తీసుకుంటానని ఆదివాసీలకు న్యాయం జరిగే వరకు పోరాడుతానని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో  మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు ప్రిన్సిపాల్ అనురాధ ఆదివాసి ఉద్యోగుల సంఘం జయ బాబు   తదితరులు ఆదివాసీ నాయకులు పెద్ద ఎత్తున  పాల్గొన్నారు.

Post a Comment

0 Comments